ఎర్రుపాలెం మండల నూతన మండల విద్యాశాఖ అధికారిగా బి. మురళి మోహన్ ను గురువారం ఎర్రుపాలెం మండల పీఆర్టియు సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పీఆర్టియు అధ్యక్షులు బి. మదన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి. బాలకృష్ణ, జిల్లా మండల బాధ్యులు నాగరాజు, సంగిరెడ్డి బాబురావు, లుక్యా తదితరులు పాల్గొన్నారు.