కూసుమంచి మండలం పాలేరు అలుగు ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాష్ట్ర మంత్రులతో కలిసి పరిశీలించారు. జరిగిన నష్టంపై సీఎం పొంగులేటిని అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి పాల్గొన్నారు.