బతుకమ్మ తొలిరోజు ఖమ్మంలో భారీ వర్షం (వీడియో)

85చూసినవారు
ఎంగిలి పూల బతుకమ్మ తొలిరోజు ఖమ్మం నగరంలో భారీ వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు మళ్ళీ ఏమవుతుందోనని భయాందోళనకు గురయ్యారు. ఏది ఏమైనా గత నాలుగు ఐదు రోజులుగా మండుటెండలతో ఉక్కిరిబిక్కిరైనా ప్రజలకు ఈ వర్షం కొంతమేర ఊరటనిచ్చింది.

సంబంధిత పోస్ట్