వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

79చూసినవారు
ఖమ్మం రూరల్ మండలంలోని రామన్నపేట, దానవాయిగూడెం, తీర్థాల గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. రహదారుల మరమ్మత్తులు, తక్షణ సహాయం, బాధితుల వివరాల సేకరణపై తగు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వరద కారణంగా దెబ్బతిన్న పంటలు, రహదారులను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్