తిరుమలాయపాలెం: పిడుగుపాటుతో ముగ్గురు మహిళలకు అస్వస్థత

77చూసినవారు
తిరుమలాయపాలెం: పిడుగుపాటుతో ముగ్గురు మహిళలకు అస్వస్థత
తిరుమలాయపాలెం: బచ్చోడు తండాలో కురిసిన అకాల వర్షానికి శనివారం పిడుగుపడటంతో ముగ్గురు మహిళా కూలీలు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బచ్చోడు తండాకు చెందిన భూక్య శారద కూతురు దేవితోపాటు, ధరావత్ జీజా, మరో వ్యక్తి సరోజా మిరపతోటలో కలుపు తీస్తుండగా వర్షం రావడంతో చెట్టుకిందకు వెళ్లారు. ఈ క్రమంలో సమీపాన ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో ముగ్గురు మహిళలు అస్వస్థకు గురైయ్యారు.

సంబంధిత పోస్ట్