మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా?: ఎమ్మెల్యే

50చూసినవారు
మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా?: ఎమ్మెల్యే
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆయనకు తండ్రి కేసీఆర్ నేర్పిన సంస్కారం ఇదేనా అని ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రశ్నించారు. గతంలోనూ మంత్రి సీతక్క విషయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ చప్పట్లు కొట్టారని, మహిళలను కించపర్చితే ఊరుకోమని తెలిపారు. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం గాడిలో పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్