సత్తుపల్లి మండల పరిధిలోని సింగరేణి ఓసీ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కల్లూరు మండలం పేరువంచకు చెందిన రామకృష్ణగా స్థానికులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.