అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి స్వర్ణిక దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కిన్నెర వెంకటేశ్వరరావు, పవన్ కుమార్, ఎల్ఎస్ రెడ్డి, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం భాద్యులు ఆర్థిక సహకారంతో దివ్యాంగులకు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి మంగళవారం బస్‌పాస్‌లను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల ఆశ్రమం నిర్వాహకులు రవికుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.