సత్తుపల్లిలో వీధికుక్కల పట్టివేత

62చూసినవారు
సత్తుపల్లి మునిసిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని వీధి కుక్కల పట్టివేత ప్రారంభమైంది. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల బెడదపై పలువురు కౌన్సిలర్లు ప్రస్తావించడంతో పాలకవర్గం ఆమోదం తెలిపింది. టెండర్ దక్కించుకున్న ఏజన్సీ సహాయంతో సోమవారం 23వార్డులలో వీధికుక్కలను వలల సహాయంతో పట్టుకుంటున్నారు. పట్టుకున్న కుక్కలను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు శానిటేషన్ ఇన్స్ పెక్టర్ దాసరి బాబూరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్