సత్తుపల్లి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు త్వరలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. మంగళవారం వేంసూరు మండలం కుంచుపర్తి గ్రామంలో ప్రజా విజయోత్సవాలలో పాల్గొని మాట్లాడారు. అనంతరం లింగపాలెంలో కోటి రూపాయలతో బిటి రోడ్, రూ. 40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ, పంటలకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.