జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన వేంసూరు మండల తహసీల్దారుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘ నేతలు జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. వివరణ కోసం కార్యాలయానికి వెళ్లిన జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించి అక్రెడిటేషన్ కార్డులు గుంజుకోవడం, అవమానపరచడం చాలా బాధాకరమని వాపోయారు. 3రోజులు గడుస్తున్నా నేటికీ తహశీల్దార్ పై చర్యలు తీసుకోకపోవడం విచారకరమని వారు మంగళవారం మౌన పోరాట దీక్ష చేపట్టారు.