కారేపల్లి మండలం పేరుపల్లిలో బుగ్గవాగు వరద ముంపు ప్రాంతాన్ని వైరా ఎమ్మెల్యే సందర్శించారు. బుగ్గవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పేరుపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలోని ఇండ్లలోకి నీరు చేరాయి. దీంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డబుల్ బెడ్ రూమ్ కాలనీని పరిశీలించి, వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.