కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో సోమవారం సీఎస్ రేవంత్ రెడ్డి వర్చువల్ గా నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొని మాట్లాడుతూ. 39మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు కళాశాలలో చేరడం శుభ సూచకమన్నారు. నర్సింగ్ వృత్తి ద్వారా గొప్పగా ఉపాధి పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు ఉన్నారు.