వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ నార్లాపూర్ లోని అమృత్ సరోవర్ వద్ద గురువారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ అంబాజీ, ఈసీ మెషీన్, సరండి పంచాయతీ కార్యదర్శి తన్నీరు వెంకటేష్, సీనియర్ మేట్ రాజ్ కుమార్, కార్మికుడు సంజీవ్, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.