
కాగజ్నగర్: కూలీలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి'
ఉపాధిహామీ కూలీలకు పెండింగ్ వేతనాలకు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్నగర్ మండలంలోని నాగంపేట్ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు గత 6 వారాల నుంచి వేతనాలు రావడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు.