
ఆసిఫాబాద్: ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. అనంతరం తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.