
ఆసిఫాబాద్: జిల్లా న్యాయమూర్తిని సన్మానించిన ఎస్పీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అసిస్టెంట్ సెషన్ జడ్జ్ యువరాజును శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు శాలువాతో ఘనంగా సన్మానించినారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసులతో నిర్వహించిన ఓ సదస్సుకు హాజరైన ఆయనను శాలువాతో సన్మానించినట్లు తెలిపారు. వీరితో జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర రావు, ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు కరుణాకర్, రామానుజం, రమేష్, సీఐలు, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు.