శోభిత మెడలో మూడు ముళ్లు వేసిన చైతూ (వీడియో)
టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య-శోభిత వివాహం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటికొచ్చింది. పండితుల వేదమంత్రాల సాక్షిగా సరిగ్గా రా.8.13 గంటలకు శోభిత మెడలో చైతూ మూడుముళ్లు వేశారు. ఆ సమయంలో నాగార్జున, అమల, వెంకటేశ్, దగ్గుబాటి సురేశ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు సంతోషంగా కనిపించారు. తన అన్నయ్య పెళ్లిలో అఖిల్ ఆనందంతో విజిల్ వేయడం ఆకట్టుకుంటోంది.