'కొండపోచమ్మ' ఘటన.. రబ్బర్ బోట్, గజ ఈతగాళ్లతో గాలింపు

77చూసినవారు
'కొండపోచమ్మ' ఘటన.. రబ్బర్ బోట్, గజ ఈతగాళ్లతో గాలింపు
సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్‌డ్యామ్‌లో గల్లంతైన మృతదేహాల కోసం స్థానిక ఫైర్ డిపార్ట్మెంట్‌కి చెందిన ఓ రబ్బర్ బోట్ తో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. JCBలతో తీసిన లోతైన గుంతల్లో పడిపోయి ఉంటారని భావిస్తున్నారు. శామీర్‌పేట్‌లోని NDRF టీమ్స్‌కి సమాచారం అందించడంతో కొద్దిసేపటి క్రితం టీమ్ బయల్దేరినట్లు తెలుస్తోంది. లోపు మృతదేహాలు వెలికి తీసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్