దాడి ఘటనలో కేసు నమోదు

66చూసినవారు
దాడి ఘటనలో కేసు నమోదు
అశ్వరావుపేట మండలం, గాండ్లగూడెంకు చెందిన ఉప్పుశెట్టి వెంకటలక్ష్మి భర్త రెండేళ్ల క్రితం మృతి చెందగా మామయ్య అయిన వాంకుడోత్ లాల్యా ఇంట్లో ఉంటోంది. ఈనెల 15న రాత్రి 10 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన వాంకుడోత్ రాము ఆమెతో గొడవకుదిగాడు. దీంతో లాల్యా ఇంటి నుంచి బయటకు వచ్చి నిలదీస్తుండగా రాము అన్న శ్రీను వచ్చి మామా కోడళ్లపై దాడి చేశారు. ఫిర్యాదు మేరకు రాము, శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్