దమ్మపేట మండల కేంద్రానికి చెందిన ఫాతిమా అనే మహిళకు కొత్తగూడెంకు చెందిన అజ్మత్ తో పదేళ్ల క్రిందట వివాహం జరిగింది. గత నెలరోజులుగా మహిళ ఫాతిమా తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో అత్తింటివారిపై ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారి పై బైఠాయించి కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించింది.