తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం అశ్వారావుపేట మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ క్యాంప్ కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఎడతెరిపి లేని వానలకు సామర్ధ్యం మించి వరద రావడంతో గండిపడి కట్ట కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్ట్ పరిశీలించేందుకు మంత్రి రానున్నారు.