పెద్దమ్మతల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన

83చూసినవారు
పెద్దమ్మతల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి ఆలయంలో గురువారం అమ్మవారికి 108 పుష్పములతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. పూజలో భాగంగా ముందుగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన, నీరాజనం సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి తెలిపారు.

సంబంధిత పోస్ట్