పాల్వంచ ఘనంగా కారల్ మార్క్స్ జయంతి వేడుకలు

57చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ సిపిఐ (ఎం. ఎల్) మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కారల్ మార్క్స్ 207వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు మాట్లాడుతూ నిరంకుశ పరిపాలన లేని సమాజాన్ని స్థాపించాలని, తన జీవితమంతా అవిశ్రాంతంగా కృషిచేసిన గొప్ప వ్యక్తి కారల్ మార్క్స్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్