గౌతాపురం నుండి సోంపల్లి వరకు రాకపోకలకు మహర్ధశ కలిగింది. పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సహకారంతో గౌతమీపురం ఆర్ఎండి రోడ్ నుంచి సోంపల్లి చర్చి వరకు సుమారు కోటి రూపాయల వ్యాయంతో 1. 5 కిలోమీటర్ల బీటి రోడ్డు నిర్మాణానికై మంజూరు చేయించారు. కొన్ని ఏళ్ల నాటి వారి కష్టాలు తొలిగించినందుకు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు ఆదివారం కృతజ్ఞతలు తెలియజేశారు.