చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన పినపాక మండలంలోని పోట్లపల్లి పెదవాగు చెక్ డ్యాం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోట్లపల్లి గ్రామానికి చెందిన పాయం నాగేశ్వరరావు(26) అదే గ్రామానికి చెందిన మరోవ్యక్తితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. వల తీసే క్రమంలో లోతులోపడి మునిగిపోయాడు. మరో వ్యక్తి భయంతో కేకలు వేస్తు వెంటనే ఒడ్డుకి వచ్చాడు. గమనించిన గ్రామస్థులు ఏడూళ్లబయ్యారం పోలీసులకు సమాచారం అందించారు.