మణుగూరు సింగరేణిలో ఇంటర్నల్ ఈపి ఆపరేటర్ ట్రైనీ(కేటగిరి-5) పోస్టులను 60 నుండి 100కు పెంచినట్లు జీఎం(పర్సనల్) బీఆర్ దీక్షితులు ప్రకటించారని ఏరియా అధికార ప్రతినిధి ఎస్ రమేష్ శుక్రవారం తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు డ్రైవింగ్ ప్రొపిషియన్సీ టెస్ట్ నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారికి సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రేపు వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.