తెలంగాణ రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి (మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్) సభ్యుడిగా సారపాక ఐటీసీ పేపర్ పరిశ్రమలోని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ యారం పిచ్చిరెడ్డి గురువారం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్మికశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ జీఓ నెం. 21 జారీచేశారు. గత మార్చిలో రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి అధ్యక్షుడిగా ఐఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్ ను నియమించిన ప్రభుత్వం, తాజాగా 12 మంది సభ్యులను నియమించింది.