డిసెంబర్ 20, 21 తేదీల్లో పట్టణంలో జరిగే సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. ఇల్లందు ఏలూరి లక్ష్మి నారాయణ భవన్లో మహాసభల జయప్రదం కొరకు ఆదివారం జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభలకు రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు జిల్లాలో అన్ని మండలాల నుంచి ఎంపిక చేయబడిన ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.