ఇల్లందు జేకే 5 ఎక్స్టెన్షన్ ఓసీలో నిర్వాసితులు కానున్న వారికి 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని గురువారం అఖిలపక్షం ఎమ్మెల్యే కోరం కనకయ్యను కోరేరు. 21 పిట్ అఖిలపక్షం ఆధ్వర్యంలో విన్నవించారు. జేకే 5 ఓపెన్ కాస్ట్ విస్తరణ చేస్తున్న నేపథ్యంలో విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ పంచాయతీలలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, సాగుభూములు కోల్పోతున్నామని, ఆదుకోవాలని వివరించారు.