కామేపల్లి మండలం గరిడేపల్లి గ్రామంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం అంగరంగ వైభగంగా జరిగింది. గురువారం స్థానిక ముత్యాలమ్మ ఆలయంలో దావత్ వీరన్న, భాను, రాములు, లేతాకుల మహబూబ్ రెడ్డి గురుస్వాముల ఆధ్వర్యంలో 70 మంది అయ్యప్ప మాలదారులకు ఇరుముడి కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మహా అన్నదానాన్ని నిర్వహించారు.