ఇల్లెందులో మండలంలోని చల్లసముద్రం, రేపల్లెవాడ పంచాయతీల్లో వర్షాలకు దెబ్బ తిన్న పంటలను ఎమ్మెల్యే
కోరం కనకయ్య గురువారం పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.