చిన్నారి గుండె ఆపరేషన్‌కు కేటీఆర్ సాయం

70చూసినవారు
చిన్నారి గుండె ఆపరేషన్‌కు కేటీఆర్ సాయం
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద మనసు చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపెళ్ళికి చెందిన ముక్క బాలరాజు- కల్పనా దంపతుల కుమారుడు భరత్ కుమార్(5 నెలలు) గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అయితే బాలుడి ఆపరేషన్ కోసం రూ.8 లక్షలు అవుతుందని వైద్యులు చెప్పారు. ఓ కార్యకర్త ద్వారా ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్‌.. బాలుడి ఆపరేషన్‌కు సాయం అందించే ఏర్పాటు చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్