సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం

78చూసినవారు
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
సింగపూర్ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థిక వేత్త లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. వీరిద్దరూ పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందినవారే. వాంగ్ ప్రధాని పదవితోపాటు ఆర్థిక మంత్రి పదవినీ నిర్వహిస్తారు. దేశాధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం (67) వాంగ్‌తో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్