ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి

57చూసినవారు
ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి
TG: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అడ్లూరు ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వైపు ఆటో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్