శుక్రవారం అమ్రాబాద్ లో రోడ్ షో

84చూసినవారు
శుక్రవారం అమ్రాబాద్ లో రోడ్ షో
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలో ఎంపి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోడ్డు షో నిర్వహిస్తుందని ఆ పార్టీ మండల నాయకులు తెలిపారు. ఈ రోడ్డు షో కార్యక్రమంలో ఎంపి అభ్యర్థి, మాజీ ఎంపి, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొంటారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్