తుఫాను ప్రభావంతో మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, కౌకుంట్ల మండల పరిధిలోని గ్రామాలలో గురువారం ఉదయం నుండి చల్లని ఈదురు గాలులు వీస్తూ.. ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ మేరకు సాయంకాలం చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. గ్రామాల ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొలాలలో పని చేసే రైతులు, కూలీలు చలికి, చిరు జల్లులకు ఇబ్బందులు పడ్డారు.