దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కనిమెట్టలోని శ్రీ కలియుగ వైకుంఠ హరిహర అయ్యప్ప క్షేత్రంలో సోమవారం శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి వారికి అభిషేకాలు నిర్వహించినారు. అనంతరం దివ్య పదునెట్టాంబడిని వెలిగించారు. ఆధ్యాత్మిక భజన పాటలతో అయ్యప్ప స్వాములు తన్మయం చెందారు. హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, ప్రజలతో స్వామియే శరణమయ్యప్ప నామములతో మారు మ్రోగింది.