జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రాయచూరు మార్గంలో మంగళవారం స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ లోని నందవరం మండలానికి చెందిన రాముడు ద్విచక్ర వాహనం పై వేగంగా వచ్చి కిందపడి గాయాల పాలయ్యాడు. చుట్టుపక్కల వారు ఆయనను రక్షించారు. ప్రాణాపాయం తప్పడంతో బాధితుడు బైక్ పై తన గ్రామానికి వెళ్ళాడు.