భౌతిక కాయానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

62చూసినవారు
భౌతిక కాయానికి  నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెర గ్రామానికి చెందిన కుర్వ బుడ్డమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు బుధవారం వారి స్వగృహానికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసు బోజ్జయ్య, రాముడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్