ఎర్రవల్లిలో కాంగ్రెస్ సభ.. వాహనదారులకు కీలక సూచన

78చూసినవారు
ఎర్రవల్లిలో కాంగ్రెస్ సభ.. వాహనదారులకు కీలక సూచన
ఎర్రవల్లిలో కాంగ్రెస్ సభ నేపథ్యంలో వాహనదారులకు ఆదివారం గద్వాల ఎస్పి రితిరాజ్ పలు సూచనలు చేశారు. గద్వాల నుంచి సభకు వచ్చే వాహనాలు ధన్వంతరి మెడికల్ షాప్ సమీపంలో ఖాళీ వెంచర్ లో నిలుపుకోవాలన్నారు. షేక్ పల్లి నుంచి వచ్చే వాహనాలు వైన్ షాప్ ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో, కర్నూలు వైపు నుంచి వచ్చే వాహనాలు పుల్లారెడ్డి పెట్రోల్ పంపు లెఫ్ట్ సైడ్, బీచుపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు ఏకశిలా స్కూల్ వద్ద పార్కు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్