మహబూబ్ నగర్: స్కాన్ చేయండి... అభిప్రాయం చెప్పండి: ఎస్పీ

62చూసినవారు
మహబూబ్ నగర్: స్కాన్ చేయండి... అభిప్రాయం చెప్పండి: ఎస్పీ
పోలీస్ సేవలపై మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసినట్లు ఆదివారం జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అతికించడం జరిగిందన్నారు. ప్రజలకు అందుతున్న ఐదు పోలీస్ సేవలపై ఎఫ్ఐఆర్, ఈ-చాలన్ ట్రాఫిక్ ఉల్లంఘనలు, పాస్ పోర్ట్ ధ్రువీకరణ, ఇతర అంశాలపై అభిప్రాయాన్ని స్వచ్ఛందంగా క్యూఆర్ ను (https: //qr. me- qr. com/aZMTxHDm) స్కాన్ చేసి తెలపవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్