మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమంలో అమరుడైన ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీసు కిష్టయ్య 6వ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. పాలమూరు జిల్లాను పండగ సాయన్న జిల్లాగా నామకరణం చేయాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు తెప్ప కృష్ణ డిమాండ్ చేశారు.