జడ్చర్లలో మంగళవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ప్రదర్శనను జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి పని చేసే విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సైన్స్ లేనిది జీవితం లేదని, ప్రతిదీ సైన్స్ పై ఆధారపడి ఉందని అన్నారు.