కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో నిర్వహించిన రైతు పండుగ బహిరంగ సభ విజయవంతమైందని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ. దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకు ఒకేసారి దాదాపు రూ. 21 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.