జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సోమవారం సోనియా గాంధీ జన్మదిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.