నమ్మి గెలిపించండి.. మీకు నేనున్నా: డీకే అరుణ
న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో నావంతు సహాయ సహకారాలు అందిస్తామని పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీ కె. అరుణ భరోసాను ఇచ్చారు. బుధవారం మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జిల్లా బార్ అసోసియేషన్ లో న్యాయవాదులతో డీకే అరుణ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా. న్యాయవాదులంతా బీజేపీ అభ్యర్థి అరుణకు సంఘీభావం ప్రకటించారు. అరుణ గెలుపులో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసాను ఇచ్చారు.