కల్వకుర్తి నియోజకవర్గంలోని కుప్పగండ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని ఆదివారం టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు. శుద్ధ జలాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చేసిన వినతికి స్పందించిన ఆయన తన సొంత నిధులు 3 లక్షల రూపాయలు వెచ్చించి నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.