మహబూబ్ నగర్ లోని ఉప్పునూతల గ్రామానికి చెందిన 35 మంది ఆదివారం యాదగిరి గుట్టకు వెళ్లి వస్తుండగా వరంగల్ హైవేపై డీసీఎం వాహనం బ్రేక్ లు ఫెయిల్ కావడంతో వాహనం బోల్తా పడింది. అందులో ఉన్న ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.