మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు వర్క్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు భాస్కర శర్మ కొలబద్దలను (స్కేల్) పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేసిన అనంతరం ఉపాధ్యాయుడు భాస్కర శర్మ 23 మంది విద్యార్థులకు కొలబద్దలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.